News March 13, 2025

నిర్మల్: ‘కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలి’

image

కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. గురువారం నిర్మల్‌లోని వైద్య శాఖ కార్యాలయంలో వ్యాధి గుర్తింపుపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించినట్లయితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు.

Similar News

News March 21, 2026

సిద్దిపేటలో యాక్సిడెంట్.. ఐదేళ్ల బాలుడి మృతి

image

సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాములు, భారతి దంపతులకు వైష్ణవి, గంగారాం(5) పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన రాములు ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట 16వ వార్డులో ఉంటున్నారు. శుక్రవారం గంగారాం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News March 21, 2026

ఏలూరు:ఈతకు వెళ్లి మరణించిన ఇద్దరు మృతదేహాలు లభ్యం

image

కుక్కునూరు, వేలేరు గ్రామ పరిధిలోని గోదావరి నదిలో 7 యువకులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో ముగ్గురు మృతదేహాలను శుక్రవారం గుర్తించారు.SDRF,EDRF ప్రత్యేక బృందాలను పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టగా ఇద్దరూ మృతదేహాలను శనివారం గుర్తించారు. సతీష్ కుమార్ మదనపల్లి, తేజాన్న ఉయ్యూరు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు.

News March 21, 2026

10 రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,540 పలుకుతోంది.