News March 13, 2025
గార్ల: అస్వస్థతకు గురై వలస కూలీ మృతి

ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన శ్రీనివాస్(35) అనే వలస కూలీ డోర్నకల్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద అస్వస్థతకు గురై మరణించినట్లు ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. అస్వస్థతకు గురైన శ్రీనివాస్‌ను అక్కడ ఉన్న కూలీలు డోర్నకల్ తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గార్ల హస్పటల్ తీసుకువెళ్లగా మృతి చెందినట్లు అతని సోదరుడు నాగభూషణం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 14, 2026
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారు: కేతిరెడ్డి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సిద్ధాంతం ఒంటరి పోరాటమని, ఒంటరిగానే గెలుస్తామని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీలో సున్నపు పొడి కనిపిస్తే సత్యకుమార్ వస్తున్నారని అర్థమన్నారు. ఆయనను సత్యకుమార్ అనడం కంటే పీపీపీ మంత్రి అనడమే కరెక్ట్ అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
News January 14, 2026
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

AP: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.
News January 14, 2026
అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య 6 లైన్ల రోడ్డుకి DPR జాప్యం

విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో కీలకమైన గోదావరి జిల్లాలను విశాఖతో అనుసంధానించే జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు DPR (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) దశలోనే జాప్యం జరుగుతోంది. రాజమహేంద్రవరం-అనకాపల్లి మధ్య 161 KM మేర ఉన్న 4 లైన్ల రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. DPR ఖరారు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టుకు సుమారు రూ.9,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా.


