News March 13, 2025
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు

AP: వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఒకే సబ్జెక్ట్‌గా మ్యాథ్స్ ఎ-బి, బోటనీ-జువాలజీని చేయనున్నారు. జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
Similar News
News January 13, 2026
యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మే 24న, మెయిన్స్ ఆగస్టు 21న నిర్వహిస్తామని గతంలో యూపీఎస్సీ ప్రకటించింది.
News January 13, 2026
రేపే మకరజ్యోతి దర్శనం

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.
News January 13, 2026
మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.


