News March 13, 2025

KMR: పక్వానికి రాని పంటను కొయొద్దు: DAO

image

కామారెడ్డి జిల్లాలో వరి కోతల సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం IDOCలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడారు. హార్వెస్టర్‌లు పక్వానికి రాని పంటను కొయొద్దని సూచించారు. నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో కోతకు రాని పంటను కోస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 6, 2025

వరద బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించిన కలెక్టర్

image

కే.వి.బి.పురం మండలంలోని ఒళ్లూరు సమీప రాయల చెరువు తెగిపోవడంతో మూడు గ్రామాలు వరద నీటికి గురయ్యాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3,000 ఆర్థిక సాయం కల్పించడంతో పాటు బియ్యం 25 కిలోలు, పప్పులు, కూరగాయలు, నూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. పశు నష్టం వాటిల్లిన రైతులకు ఆవు,గేదెకు రూ.50,000, మేకకు రూ.7,500 పరిహారం అందించబడుతుందని తెలిపారు.

News November 6, 2025

హుజూరాబాద్ ప్రజలతో 25 ఏళ్ల అనుబంధం ఉంది: ఈటల

image

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తానని, ఇక్కడి ప్రజలతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు.

News November 6, 2025

ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.