News March 13, 2025

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏపీ గురుకుల పాఠశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి 5,6,7,8 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి 80సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. ఆసక్తి గలవారు https://aprs.ofss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News November 6, 2025

గద్వాల్: మధ్యాహ్న భోజన ఛార్జీల పెంపు.. ఏజెన్సీలకు ఊరట

image

ప్రభుత్వం విద్యార్థుల కోసం అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,227పాఠశాలల్లో 3,58,400 విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి అందిస్తున్న భోజనం కోసం పెరిగిన ధరల ప్రకారం నెలకు రూ.86 లక్షల అదనపు భారం పడనుంది. ధరలు పెరిగిన క్రమంలో ప్రభుత్వ ప్రకటనతో ఏజెన్సీలకు ఊరటనిసస్తోంది.

News November 6, 2025

ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను వరంగల్ కలెక్టర్ డా.సత్యశారద అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మార్కెట్‌లోని రైతులు, వ్యాపారస్తులతో ముచ్చటించి, మార్కెట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్కెట్ అధికారులతో కలెక్టర్ చర్చించారు.

News November 6, 2025

ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/