News March 13, 2025
కృష్ణాజిల్లా TODAY TOP NEWS

* మచిలీపట్నంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఏడేళ్లు జైలు
* కృష్ణాజిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్.. విద్యార్థుల జోష్
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.7.63లక్షలు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ 17కి వాయిదా
* తాడేపల్లిలో జగన్ని కలిసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు
* కృష్ణా జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలు: Way2Newsతో- DEO
* GDV: రైలులో నుంచి జారిపడి మహిళ మృతి
Similar News
News March 15, 2025
కృష్ణా: నేటి నుంచి ఒంటి పూట బడులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:45నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
News March 14, 2025
బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
News March 14, 2025
ఘంటసాల: బ్రతుకు తెరువు కోసం వస్తే బ్రతుకులు తెల్లారాయి

పొట్టకూటి కోసం కోటి కష్టాలని.. బ్రతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.