News March 14, 2025
దువ్వాడ మీదుగా నహార్‌లగూన్‌కు స్పెషల్ ఎక్స్‌ప్రెస్

హోళీ పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా చర్లపల్లి – నహార్‌లగూన్‌కు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07046/47) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు మార్చి 15, 22, 29న నడుస్తాయన్నారు. మళ్లీ మార్చి 18, 25, ఏప్రిల్ 1వ తేదీలలో నహార్‌లగూన్ నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా చర్లపల్లి చేరతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News March 22, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 22, 2026
విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.
News March 22, 2026
విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.


