News March 14, 2025

ఆసిఫాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

image

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 14, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.

News March 14, 2025

చేప కొరికితే చేయి పోయింది!

image

ఒక్కోసారి చిన్నగాయాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన రాజేశ్ అనే రైతు గత నెల ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా చేతి వేలిని ‘కడు’ జాతి చేప కొరికింది. చూస్తుండగానే అది ‘గ్యాస్ గాంగ్రీన్’ ఇన్ఫెక్షన్‌గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడిచేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నుంచి అతడి ఒంట్లో చేరిన క్లోస్ట్రిడియమ్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.

News March 14, 2025

మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ADBలో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!