News March 14, 2025
సూర్యాపేట: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

సూర్యాపేటలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI
Similar News
News March 22, 2026
ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్‌కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 22, 2026
కోనసీమ జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో శనివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్సైలు పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
News March 22, 2026
నంద్యాల కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన దరఖాస్తుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే సదుపాయం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


