News March 14, 2025

నరసరావుపేట: జిల్లా కలెక్టర్ హెచ్చరికలు

image

సహకార సంఘ బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసే విషయంలో పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. కలెక్టరేట్లో సహకార సంఘం అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. మాట్లాడుతూ సంవత్సరం నుంచి కంప్యూటరీకరణ జరుగుతుందని పురోగతి సరిగా లేదని అన్నారు. సరిగా పనిచేయని సంఘ సీఈవో పై ఏమి చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారులను ప్రశ్నించారు.

Similar News

News March 25, 2026

మంథని JNTUHకి 16 ఏళ్లు..!

image

గ్రామీణ యువతకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే సంకల్పంతో మార్చి 25, 2010న మంథని JNTUHని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. PDPL(D) రామగిరి(M) కల్వచర్లలో NAAC- ‘A+’ గ్రేడ్ గుర్తింపుతో, 52 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, హాస్టల్ వసతులతో అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్మాణానికి సింగరేణి సహకారం అందించినందుకు ఉద్యోగుల పిల్లలకు 10% సీట్లను ప్రభుత్వం కేటాయించింది.

News March 25, 2026

విజయవాడ: రూ. 2 కోట్ల ఆశచూపి రూ.36 లక్షలు కొట్టేశాడు..!

image

పెట్టుబడుల పేరుతో హనుమంతరెడ్డి అనే వ్యక్తిని హరిప్రసాద్ అనే కేటుగాడు దారుణంగా మోసగించాడు. బందర్ రోడ్డులో రూ. 2 కోట్ల నగదు ఉందంటూ ఓ సూట్‌కేస్ ఇచ్చి, ప్రతిగా హనుమంతరెడ్డి వద్ద ఉన్న రూ.36 లక్షలు తీసుకుని ఉడాయించాడు. తీరా సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు ఉండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News March 25, 2026

సూర్యాపేటలో కొత్త నియోజకవర్గ చర్చ!

image

నియోజకవర్గాల పునర్విభజనపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పునర్విభజన జరిగితే సూర్యాపేటను రెండుగా విభజించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. సూర్యాపేట టౌన్, రూరల్ మండలాలను కలిపి ‘సూర్యాపేట అర్బన్’ నియోజకవర్గంగా.. ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్‌తో పాటు కోదాడలోని మోతె మండలాన్ని కలిపి ‘సూర్యాపేట రూరల్’ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.