News March 14, 2025

భద్రాచలంలో వైభవంగా తీర్థ బిందె పూజలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గురువారం తీర్థ బిందె కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 15, 2026

వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

image

పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు <<19319137>>భారీగా పెరగగా<<>>, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. 5 నుంచి 30 శాతం తగ్గించేందుకు ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాక్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు.

News March 15, 2026

మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

image

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్‌లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 15, 2026

NLG: తల్లి సూసైడ్.. బాధలోనూ పరీక్షకు హాజరు

image

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన సైదమ్మ అనారోగ్యంతో మతిస్తిమితం కోల్పోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారితే పదో తరగతి పరీక్ష రాయాల్సిన కూతురు మౌనిక తీవ్ర విషాదంలో పడింది. పాఠశాల ఉపాధ్యాయులు బాలికను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే మౌనిక పరీక్ష రాసి తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.