News March 14, 2025
రామగుండం: సంప్రదాయ పద్ధతిలో హోలీ జరుపుకోవాలి: CP

రేపటి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్ధతిలో పండుగను నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మహిళల పట్ల మర్యాదగా ఉంటూ హోలీ జరుపుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శివారు ప్రాంతాలకు స్నానాల కోసం వెళ్లవద్దని యువతకు సూచించారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 21, 2026
సిద్దిపేట: పోలీస్ అధికారికి ఆపరేషన్.. చివరికి మృతి

ఓ పోలీస్ అధికారికి మెదడు ఆపరేషన్ తర్వాత మరణించిన ఘటన HYDలో జరిగింది. సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన RSI తాళ్లపల్లి రాజ సాంబయ్య చికిత్స కోసం హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. మెదడుకు ఆపరేషన్ చేయగా, పరిస్థితి విషమించి అదే రోజు మరో సర్జరీ చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు 194 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News March 21, 2026
HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం.. సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.