News March 14, 2025

నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.

Similar News

News February 11, 2026

అల్లూరి: ఊబిలో చిక్కుకొని వ్యక్తి మృతి

image

మత్స్యగెడ్డ వద్ద ఊబిలో చిక్కుకొని తమర్భ వెంకటరమణ(38) మృతి చెందాడు. పెదబయలు మండలం అరడకోటకు చెందిన వెంకటరమణ బుధవారం వేలంబొడ్డ గ్రామానికి వెళ్లడానికి బోటుతీసే యత్నంలో జారిపడి ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.

News February 11, 2026

నువ్వుల చేనులో మనుషులతో కలుపుతీత – లాభాలు

image

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.

News February 11, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఎక్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4రోజులే(FEB 15) సమయం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, సీఏలో స్పెషలైజేషన్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.eximbankindia.in/