News March 14, 2025

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు సంకల్పం: సంజయ్ కుమార్

image

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉపాధికల్పన, శిక్షణశాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ హనుమంతరావు, ఉపాధి కల్పనాధికారి సాహితి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

image

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.

News July 7, 2025

వర్ధన్నపేట వైపే స్వర్ణ చూపు..!

image

వర్ధన్నపేట నియోజకవర్గం పదేళ్ల పాటు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంది. కానీ వినూత్న పరిణామాల వల్ల ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానం జనరల్‌గా మారుతుందనే ఊహాగానాలతో వరంగల్ నగర మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చూపు తన తన సొంత నియోజకవర్గ కేంద్రంపై పడిందనే చర్చ జరుగుతోంది.

News July 7, 2025

HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

image

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.