News March 14, 2025
ప్రతి గ్రామంలో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర జరగాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 15న ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో స్వచ్ఛాంద్ర కార్యక్రమాలు పొందుపరచాలన్నారు.
Similar News
News March 7, 2026
టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.
News March 7, 2026
మానుకోటలో రాజకీయ వేడి!

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయన్న ప్రచారంతో మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో రెండు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా, మరో ఆరు మండలాలు పక్క నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. పునర్విభజన జరిగితే కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది జరిగితే జిల్లాలో బీసీ, గిరిజన సామాజికవర్గాల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది.
News March 7, 2026
హనుమకొండ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసామని డీఈఓ వెంకట గిరిరాజ్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. 4 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, చీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లు 827 మంది విధులు నిర్వహిస్తారన్నారు. సెల్ ఫోన్లు అనుమతించబోమన్నారు.


