News March 14, 2025

ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News March 18, 2026

ప్రకాశ: విద్యుత్ వినియోగదారులకు ఎస్ఈ సూచనలు

image

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. గడువు లోపు చెల్లిస్తే సర్ ఛార్జ్, పెనాల్టీ పడదని అన్నారు. జిల్లాలో కోట్ల రూపాయల మేర బిల్లు బకాయిలు విద్యుత్ సంస్థకు పెనుభారంగా మారాయని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చు అని తెలిపారు.

News March 18, 2026

ప్రకాశం: మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు నెల రోజులు ‘లేడీస్ టైలరింగ్’పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్‌సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు ఒంగోలులోని రూడ్‌సెట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్‌సెట్‌కు రావాలన్నారు.

News March 18, 2026

ప్రకాశం: ‘22 గ్రామాల సమస్య.. పట్టించుకోండి’

image

పొన్నలూరు (M)లోని 22 గ్రామాల సమస్య ఇది. కరోనా కష్టకాలంలో యూజర్లను తమవైపు తిప్పుకున్న నెట్‌వర్క్‌లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ప్రధానంగా K.అగ్రహారంలో కొద్దిరోజులక్రితం సెల్ టవర్లు తీసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంత వాసుల పరిస్థితి అడవుల్లో జీవిస్తున్నట్లే ఉంది. దీంతో సచివాలయ, బ్యాంక్ సేవలు సైతం డల్ అయ్యాయి. ఇదే ప్రాంతంలో BSNL టవర్ నిరుపయోగంగా ఉంది. 10 రోజులుగా కాల్స్ కూడా రావట్లేదని యూజర్ల ఆరోపిస్తున్నారు.