News March 14, 2025

యాదాద్రి: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

యాదాద్రిలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI

Similar News

News March 14, 2026

టుడే టాప్ స్టోరీస్

image

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

News March 14, 2026

వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

image

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

News March 14, 2026

HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్‌‌లు చేసింది ఇతడే!

image

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్‌ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.