News March 14, 2025
MNCL: సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకోవాలి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా, మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ తర్వాత యువత స్నానాల కోసం చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అనుమతి లేకుండా రంగులు చల్లడం, బైకులు, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News April 3, 2026
కృష్ణా: ఒక్కో పేపరుకు రూ.900/-

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ-వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ-వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 9లోపు ఒక్కో పేపరుకు రూ.900ల ఫీజును http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News April 3, 2026
GNT: ‘డబ్బులడిగితే ఈనంబర్‌కి కాల్ చేయండి’

పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా దళారులు జోక్యం చేసుకున్నా, అక్రమంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తన నంబర్ 98493 55955కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
News April 3, 2026
ఒత్తైన జుట్టు కోసం ఉసిరి నూనె

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.


