News March 14, 2025
కామారెడ్డి జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ రాజేష్ చంద్ర

నూతన ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం కామారెడ్డి జిల్లా జడ్జి వీఆర్ఆర్ వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా జిల్లా కోర్టులో కలిశారు. అనంతరం ఆయనకు పూల మొక్కను అందజేశారు. అనంతరం జడ్జితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 14, 2025
అమలాపురం: నాచు తయారీపై పైలెట్ ప్రాజెక్టు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానం, పల్లం గ్రామాల్లో సముద్రపు నాచు తయారీ పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. తన =కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం చర్చించారు. సముద్రపు నాచు తయారీకి 16 మంది డ్వాక్రా మహిళలు, ఆర్నమెంట్ చేపల పెంపకానికి 21మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.
News November 14, 2025
స్థానిక ఎన్నికలపై 17న నిర్ణయం: CM రేవంత్

TG: ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబినెట్ భేటీలో మంత్రులందరితో ఈ అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. కాగా జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సీఎం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 17న లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ రానుంది.
News November 14, 2025
GWL: బాలలు స్వేచ్ఛా వాతావరణంలో పెరగాలి- సునంద

బాలలు స్వేచ్ఛా వాతావరణంలో పెరగాలని గద్వాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద పేర్కొన్నారు. బాలల దినాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలభవన్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, వారిపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. అమ్మాయిలు స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.


