News March 14, 2025

NRML: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబందించిన సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్, అధ్యయన కేంద్రం సమన్వయకర్త డా.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్(www.braou.online) సందర్శించాలని సూచించారు. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

Similar News

News November 5, 2025

NLG: 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్‌లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57

image

1. శబరి ఏ ఆశ్రమంలో రాముడి కోసం ఎదురుచూసింది?
2. విశ్వామిత్రుడి శిష్యులలో ‘శతానందుడు’ ఎవరి పుత్రుడు?
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ఏంటి?
4. నారదుడు ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు?
5. కాలానికి అధిపతి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 5, 2025

నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 21 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ, NET, SLET, SET, MLISC, B.Ed, డిగ్రీ, ఇంటర్ , టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nsktu.ac.in