News March 14, 2025

MDK: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

మెదక్ జిల్లా మక్కరాజ్ పేట్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి.
– HAPPY HOLI

Similar News

News February 26, 2026

మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

image

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.

News February 26, 2026

అనకాపల్లి: 217 మంది విద్యార్థులు గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం. వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.

News February 26, 2026

NGKL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కజ్జం ఉమాపతి తెలిపారు. 2026 -27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం అర్హత కలిగిన ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు పొంది కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.