News March 14, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
Similar News
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
NLG: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ

రాష్ట్రంలోనే పేరెన్నిక గల కట్టంగూరు పశువుల సంత 75 ఏళ్లు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. 1950లో ఏర్పడిన ఈ సంత 75 ఏళ్లు దాటినా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ప్రతి శనివారం ఇక్కడ వేలాది పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100కు పైగా గ్రామాల నుంచి రైతులు పశువులు, గొర్రెలు, మేకలు విక్రయాల కోసం ఇక్కడికి వస్తుంటారు.
News November 10, 2025
అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం ప్రజల్లో స్ఫూర్తి నింపిందని గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


