News March 14, 2025

PPM: నవోదయం 2.0 ప్రారంభించిన కలెక్టర్

image

నవోదయం 2.0 కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. సంబంధిత ఎక్సైజ్ అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గంజాయి, సారా, మాదకద్రవ్యాల నివారవాణాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు.

Similar News

News March 30, 2026

ప్రకాశం: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కందుకూరు నుంచి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకోవడంతో డ్రైవర్ బస్సును మార్జిన్ దించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

News March 30, 2026

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట

image

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CM చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. దీనిపై YCP మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసును CBIకి అప్పగించాలని, CBNకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అయితే వీటికి విచారణార్హత లేదని కోర్టు ఇవాళ కొట్టేసింది.

News March 30, 2026

పెద్దపల్లి: ఆసుపత్రుల్లో టోకెన్ విధానం అమలు చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో వైద్యశాఖ పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. రోగులకు సత్వర సేవలు అందించేందుకు ఓపీలో టోకెన్ విధానం అమలు చేయాలని, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ల్యాబ్ ఫలితాలను వేగంగా అందజేస్తూ, విభాగాల వారీగా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు నిర్ణీత పని గంటల్లో అందుబాటులో ఉండి, రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.