News March 14, 2025

విశాఖలో భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు

image

భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల క్రమబద్దీకరణపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూరి అశోక్‌తో పాటు పలువు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

image

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

News February 28, 2026

విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.

News February 28, 2026

శంకుస్థాపలు సరే.. శిలఫలకాలు వేయరేం: ఎమ్మెల్యే

image

జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది పారిశుధ్య కార్మికులు హాజరవుతున్నారు? ఏ పనులు చేస్తున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. 15 సంవత్సరాలుగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు.