News March 14, 2025

HNK: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

హనుమకొండలోని ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News March 15, 2025

నా చివరి రక్తపు బొట్టువరకూ ప్రజలకు సేవ చేస్తాను: సీఎం చంద్రబాబు

image

AP: తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో CM చంద్రబాబు తెలిపారు. ‘41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితమంతా అలుపెరుగని పోరాటమే. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసినదానికి రెట్టింపు పనిని వచ్చే 5, 10 ఏళ్లలో చేస్తాను. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.

News March 15, 2025

NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

image

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.

News March 15, 2025

సిరిసిల్ల: కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

image

అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమతో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని తెలిపారు.

error: Content is protected !!