News March 23, 2024

21 చోట్ల ‘మేమంతా సిద్ధం’ సభలు

image

AP: మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 4 ప్రాంతీయ ‘సిద్ధం’ సభలను నిర్వహించిన వైసీపీ.. రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూర్‌లో సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Similar News

News October 6, 2024

రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.

News October 6, 2024

ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!

image

బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.

News October 6, 2024

కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్‌రావు పిలుపు

image

TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.