News March 23, 2024

మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పై కేసు

image

మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం.. మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో అనుమతి లేకుండా నిసార్ అహ్మద్ రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (mmc) అధికారి, నిమ్మనపల్లి ఇన్చార్జ్ ఎంపీడీవో చలపతిరావు ఫిర్యాదుతో నిస్సార్ అహ్మద్ పై కేసు నమోదు చేశారు.

Similar News

News March 12, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 12, 2026

కడపల్లి KSS సారథిగా CM చంద్రబాబు

image

శాంతిపురం(M) కడపల్లి కుటుంబ సాధికార సారథిగా CM చంద్రబాబు తన పేరు నమోదు చేసుకున్నారు. CM చంద్రబాబు నివాసం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఉండడంతో ఆ పంచాయతీ పార్టీ ప్రతినిధిగా నిర్దిష్ట బాధ్యతలను నిర్వర్తించనున్నారు. తిమ్మరాజు పల్లి బూత్ నంబర్ 49లో ఓటరు క్రమసంఖ్య 181 నుంచి 240 వరకు 60 మంది ఓటర్లను కలవనున్నారు. గత ఏడు జులై 2న CM చంద్రబాబు తిమ్మరాజు పల్లిలో పర్యటించారు.

News March 12, 2026

‘గ్యాస్ సరఫరా’పై చిత్తూరు SP సీరియస్ వార్నింగ్

image

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.