News March 23, 2024
ఏలూరు: రూ.2.59 లక్షలు సీజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 లక్షలు సీజ్ చేసినట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్లడించారు.
Similar News
News February 13, 2026
ప.గో: దళారుల చేతిలో తీర ప్రాంత యువత విలవిల

మెరుగైన జీతం కోసం విదేశాలకు వెళ్లాలనే కోస్తా తీర నిరుద్యోగుల ఆశ దళారులకు వరంగా మారుతోంది. ఆయిల్ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచుతున్నారు. ఈప్రాంతంలో ఆయిల్ రిగ్గులపై పనిచేసిన అనుభవం ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో, దళారులు సులభంగా బుట్టలో వేసుకుంటున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించిన యువత, తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.
News February 13, 2026
వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.
News February 12, 2026
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో పీఎం శ్రీ, మనబడి మన భవిష్యత్తు పథకాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సమీక్షించారు. విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడిన ఆమె.. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.


