News March 14, 2025

ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 21, 2026

పరీక్ష వాయిదా: అనంతపురం DEO

image

రంజాన్ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసిందని డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 21, 2026

అనంతపురం: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక సూచనలు

image

అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆలమూరులోని గ్యాస్ గోడౌన్, నగరంలోని పవన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఆయన, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ అందుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు రావద్దని, యధావిధిగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అవసరానికి మించి అదనపు బుకింగ్‌లు చేయవద్దన్నారు.