News March 14, 2025

‘ఆపదమిత్ర’ అమలుపై కలెక్టర్ సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపదమిత్ర పథకం అమలుపై వివిధ శాఖల ద్వారా వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్స్ గుర్తింపుపై, జిల్లా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ, మెప్మా, హెల్త్, రెవిన్యూ, ఫైర్, మత్స్య శాఖ, ఇండస్ట్రీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News March 14, 2025

మెదక్: హోళీ వేడుకలలో అదనపు కలెక్టర్

image

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైక్యతా భావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటన్నారు.

News March 14, 2025

మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

 పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.

News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

error: Content is protected !!