News March 14, 2025
హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.
Similar News
News March 14, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.
News March 14, 2025
చేప కొరికితే చేయి పోయింది!

ఒక్కోసారి చిన్నగాయాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన రాజేశ్ అనే రైతు గత నెల ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా చేతి వేలిని ‘కడు’ జాతి చేప కొరికింది. చూస్తుండగానే అది ‘గ్యాస్ గాంగ్రీన్’ ఇన్ఫెక్షన్‌గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడిచేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నుంచి అతడి ఒంట్లో చేరిన క్లోస్ట్రిడియమ్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.
News March 14, 2025
మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ADBలో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.