News March 14, 2025
సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్‌గా సమర్పించాలని తెలిపారు.
Similar News
News March 21, 2026
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంది. ఆ తర్వాత 3 రోజుల్లో క్రమంగా 3 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది.
News March 21, 2026
కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

SLBC, డిండి ఎత్తిపోతల, అచ్చంపేట కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు మొదలైనట్లు స్పష్టం చేశారు. టన్నెల్‌లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. సొరంగంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరపాలని సూచించారు.
News March 21, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.


