News March 14, 2025
సిద్దిపేట: WOW.. గ్రూప్స్లో సత్తా చాటిన బ్రదర్స్

బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతులకు చెందిన కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేష్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం వెంకటేష్ పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నాడో హరికృష్ణ గ్రూప్-2లో 184 ర్యాంక్ సాధించారు.
Similar News
News October 18, 2025
రాజమండ్రి: నార్కో కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం

తూర్పు గోదావరి జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలలో చైతన్యం పెంచి, యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 18, 2025
NLG: పెద్దగుట్టపై మృతదేహం కలకలం

RR జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పెద్దగుట్టపై ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుట్టపై చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. పక్కనే సెల్ఫోన్, దుస్తులు లభ్యమయ్యాయి. సెల్ఫోన్ ఆధారంగా అతడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు వాసి నరేశ్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
News October 18, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఈ నెల 19-24 వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన.. వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
* తిరుమలలో TG భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.4లక్షలు కాజేసి పరారీ
* పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు(D)కు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై TDP అధిష్ఠానం సీరియస్.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుపు