News March 14, 2025
టెన్త్ ఎగ్జామ్స్..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
నా పిల్లలు చనిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు: చిన్మయి

SMలో అబ్యూస్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లైనా పర్వాలేదు నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.
News November 6, 2025
నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

* 1913: మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేశారు
* 1940: గాయని, రచయిత శూలమంగళం రాజ్యలక్ష్మి జననం
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)
* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం
News November 6, 2025
ములుగు : ప్రాణాంతకంగా అడవి పందులు, కోతులు..!

జిల్లాలో కోతులు, అడవి పందుల బెడద ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ రెండు ప్రాణులు ఇప్పుడు మనుషులకు ప్రాణాంతకంగా మారాయి. గ్రామాలలో మందలుగా తిరుగుతున్న కోతులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో చాలామంది గాయపడుతున్నారు. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇదే తరహాలో అడవి పందులు పంటల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాపలాకు వెళ్లిన రైతులపై దాడులకు పాల్పడుతున్నాయి. వీటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.


