News March 14, 2025
ఖమ్మం: హోళీ వేళ.. సిటి పోలీస్ యాక్ట్ అమలు

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ వేడులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, వాహనాలపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
ఖమ్మం: సమస్యల పరిష్కారంపై అధికారులు చురుకుగా ఉండాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యతిరేక వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న సేకరణ సజావుగా జరగాలని, పాఠశాలల భోజన నాణ్యత పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు పడకల ఇళ్ల కేటాయింపులు, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై కూడా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు.
News November 10, 2025
ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News November 10, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్‌ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్‌డేట్ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.


