News March 14, 2025

MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

image

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్‌కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్‌ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.

Similar News

News January 21, 2026

మా వైఖరిలో మార్పు లేదు: బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

image

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరామని చెప్పారు. BCCI ఒత్తిడితో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అంగీకరించబోమన్నారు. తాము తప్పుకుంటే స్కాట్లాండ్‌ను చేర్చుతారన్న వార్తలను కొట్టిపారేశారు. గతంలో పాకిస్థాన్ భారత్‌కు రాకపోతే వేదిక మార్చారని గుర్తు చేశారు.

News January 21, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 21, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 21, 2026

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.