News March 14, 2025
వికారాబాద్: అడవి పంది.. వ్యక్తి ప్రాణం తీసింది..!

అడవి పందిని తప్పించబోయి బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘవపూర్ శివారులో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటకు చెందిన కావాలి సుధాకర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
విజయవాడలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ GGH PG విద్యార్థిని డా. దీపిక ఆత్మహత్య కేసును మాచవరం పోలీసులు ఛేదించారు. సీనియర్ విద్యార్థి డా. అమర్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. నిందితుడు అమర్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్థాపం చెందిన దీపిక, గత నెల 5న ఇంజక్షన్ తీసుకుని తనువు చాలించింది. ఫోన్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరించిన పోలీసులు అమర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 10, 2026
సిద్దిపేట: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు.
News March 10, 2026
వేలాది కోళ్లు మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

TGలోని నాగర్‌కర్నూల్(D)లో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో AP ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.


