News March 23, 2024
కాకినాడ: హైవేపై బోల్తా కొట్టిన వ్యాన్

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు నుండి శ్రీకాకుళం జిల్లాకు జామకాయల లోడుతో వెళ్తున్న బొలోరో వ్యాన్ నీలాద్రిరావుపేట వద్దకు వచ్చేసరికి లారీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జామకాయలు రోడ్డుపై పడిపోయాయి. వ్యాన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News April 18, 2025
తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.
News April 18, 2025
RJY: డోర్ డెలివరీ కేసు.. ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్‌డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.
News April 17, 2025
నిడదవోలు: ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్‌కి RTC నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- ఖమ్మం మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్‌ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.