News March 14, 2025

‘విజయనగరం జిల్లా రైతులకు రూ.2.5కోట్ల రాయితీ’

image

విజయనగరం జిల్లాలో అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.2.5కోట్లు సబ్సిడీ ఇవ్వనుందని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు చెప్పారు. గురువారం తెర్లాం వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్ప్రింక్లర్లు, పవర్ స్ప్రింక్లర్లు, రోటోవీటర్లు, ట్రాక్టర్ పరికరాలు 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

Similar News

News March 23, 2026

VZM: క్షయ నిర్మూలనకు ‘వందరోజుల కార్యక్రమం’ ప్రారంభం

image

జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ‘క్షయ వందరోజుల కార్యక్రమం’ను అమలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జీవన రాణి తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

News March 23, 2026

రెండు దశల్లో జనగణన: VZM కలెక్టర్

image

జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహిస్తామని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండో దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని చెప్పారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, నిబంధనలు పాటిస్తూ తప్పులు లేకుండా లెక్కింపు చేయాలని సూచించారు. ఈసారి జనగణన పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుందని తెలిపారు.

News March 23, 2026

విజయనగరంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు

image

విజయనగరంలోని ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.