News March 14, 2025
దాదాపు రెండేళ్లకు ఓటీటీలోకి..

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమా సోనీ లీవ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా అఖిల్ కొత్త మూవీ షూటింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం.
Similar News
News March 15, 2025
ఇవాళ అసెంబ్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఉ.10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌పై విపక్షాల విమర్శల నడుమ ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.
News March 15, 2025
కొత్త కెప్టెన్లు.. ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025లో అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారయ్యారు. కొత్తగా పంజాబ్‌కు శ్రేయస్, KKRకు రహానే, లక్నోకు పంత్, ఢిల్లీకి అక్షర్, ఆర్సీబీకి రజత్ పాటీదార్‌ను సారథులుగా నియమించారు. ఇందులో KKR మినహా మిగతా జట్లకు ఇప్పటివరకు ఒక్క కప్పు రాలేదు. గత సీజన్‌లో కోల్‌కతాను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఈ సారి పంజాబ్‌తో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి కొత్త కెప్టెన్ల రాకతోనైనా ఆయా జట్ల దశ మారుతుందో చూడాలి. మీ కామెంట్?
News March 15, 2025
21 రోజులైనా దొరకని అచూకీ

TG: శ్రీశైలం SLBC టన్నెల్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఏడుగురి కార్మికుల ఆచూకీ 21 రోజులైనా లభించలేదు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు అత్యాధునిక రోబోలను ఉపయోగిస్తున్నారు. టన్నెల్‌లోకి బురద చేరడం, నీటి ఊట రావడంతో రెస్య్కూకు ఆటంకం కలుగుతోంది. ఐదు రోజుల క్రితం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే.