News March 14, 2025
PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News March 14, 2025
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.
News March 14, 2025
మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.
News March 14, 2025
గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.