News March 14, 2025

ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

image

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Similar News

News March 22, 2026

ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

image

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్‌ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్‌తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.

News March 22, 2026

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: అమిత్ షా

image

అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ <<19447588>>రికార్డ్<<>> నెలకొల్పిన నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని.. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇందుకే ప్రజలు ఆయనను మూడు సార్లు గుజరాత్ సీఎం, మూడు సార్లు భారత ప్రధానిని చేశారని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

News March 22, 2026

సమస్య ఏదైనా.. 1100కు కాల్ చేయండి: కలెక్టర్

image

జిల్లాలో మార్చి 23న ‘మీకోసం-రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమం యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో (meekosam.ap.gov.in) కూడా నమోదు చేసుకోవచ్చని, స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.