News March 14, 2025

నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

image

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.

Similar News

News March 27, 2026

సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే

image

TG: ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచారం/పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30days గడువుంటుంది. 5ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

News March 27, 2026

WGL: స్టాక్ మార్కెట్ పేరుతో రూ.కోటి మోసం

image

వరంగల్ నగరంలో ఓ రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.కోటి దోచుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, విడతల వారీగా డబ్బులు జమ చేయించారు. చివరకు ఆదాయ పన్ను పేరుతో అదనంగా డబ్బు అడగడంతో అనుమానం వచ్చి విషయం బయటపడింది. బాధితుడి మనవడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2026

విజయవాడ: చదివింది మూడు.. దొంగతనాలు 80

image

అంతర్రాష్ట్ర దొంగను గురువారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ ఏడీసీపీ రాజారావు వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఆరేపల్లి దుర్గారావు మూడో తరగతి వరకు చదువుకుని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో అతనిపై 80 కేసులు ఉన్నాయి. ఇతను ఇటీవల పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడగా నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.