News March 14, 2025
తూ.గో: నానమ్మ, మనవడు ఊరికి వస్తూ మృతి

దుద్దుకూరు NHపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. వారి వివరాలు.. గోపాలపురానికి చెందిన నానమ్మ మీరా తున్నాషా(55), మనవడు షహీర్(20)లు బైక్‌పై పంగిడి నుంచి వస్తుండగా దుద్దుకూరు వద్ద లారీని ఢీకొట్టారు. వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించారు. తున్నాషా భర్త హార్ట్ సర్జరీ చేయించుకోని ఇంటి వద్దే ఉంటున్నాడు. షహీర్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశాడు.
Similar News
News November 18, 2025
హుస్నాబాద్: డ్రైవర్‌కు అభినందనలు: మంత్రి

మనుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ చూపిన మానవత్వం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణికురాలు దిగగా చిన్నారిని ఎవరు చూసుకునే వాళ్లు లేకపోవడంతో చిన్నారిని ఎత్తుకొని ఆలనా పాలన చూసి డ్రైవర్ మంచి పనిచేశారని కొనియాడారు. విధుల్లోనే కాదు మానవత్వంలోనూ ఆర్టీసీ డ్రైవర్లు మంచితనం చూపుతున్నారని పేర్కొన్నారు.
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.