News March 14, 2025

గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు 

image

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News

News January 15, 2026

కృష్ణా: కోడి పందేలలో ఇవే కీలకం?

image

కోడి పందేల విషయంలో వారాలు, రంగులు, దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు విశ్వసిస్తున్నారు. ఆది, మంగళ డేగ, సోమ, శని నెమలి, బుధ, గురువారాల్లో కాకి. ఈ రోజుల్లో ఈ కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే బరిలో కోడిని వదిలే దిశ కూడా కీలకమని చెబుతున్నారు. భోగి నాడు ఉత్తర దిశ, సంక్రాంతికి తూర్పు దిశ, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి కోడిని దింపితే విజయం వరిస్తుందని శాస్త్రం చెబుతుందంట.

News January 14, 2026

కృష్ణా: కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్!

image

జిల్లా వ్యాప్తంగా కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్ కొనసాగుతోంది. గుడివాడ, కేసరపల్లి, ఈడుపుగల్లులో కోడి పందేల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నిర్వాహకులు సందడి చేస్తున్నారు. కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట వంటి ఆటలతో పందెం బాబులను ఆకర్షిస్తున్నారు. సరదాగా పందేలు చూడటానికి వచ్చిన వారు గ్యాంబ్లింగ్‌లోకి లాగబడి జేబులు ఖాళీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

News January 12, 2026

సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లను గుర్తించండి: కలెక్టర్

image

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు.