News March 23, 2024

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

Similar News

News March 12, 2026

ఖమ్మం: కావూరి సాంబశివరావుకు అంతిమ వీడ్కోలు

image

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మనవడు ఎంపీ శ్రీ భరత్‌తో పాటు కావూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధు యాష్కీ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.

News March 12, 2026

ఖమ్మం: విద్యుత్ ఫిర్యాదులకు ‘వాట్సాప్’ పరిష్కారం

image

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్‌కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

News March 12, 2026

ఖమ్మం: తీరిన గ్యాస్ గండం.. భోజన కష్టాలు దూరం

image

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.