News March 14, 2025
చొప్పదండి: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన పూసాల రోహిత్(17) కరీంనగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోహిత్ పెద్దమ్మ రావుల అరుణ నిద్రలేచి చూడగా.. వరండాలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడనే భయంతో ఉరేసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Similar News
News April 4, 2026
వరంగల్: కూల్ కూల్ వాటర్.. భలే భలే ‘కుండలు’

వేసవి తాపానికి రేగడి మట్టితో తయారు చేసిన రంజన్లు పేదల ఫ్రిజ్‌లుగా మారుతున్నాయి. వరంగల్ నగరంలోని పోస్టాఫీసు గల్లీలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో రంజన్, కుండను రూ.100కు పైగా పలుకుతుండగా, రోజుకు 50 నుంచి 100 వరకు అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీటి కంటే ఈ మట్టి కుండల నీరే ఆరోగ్యానికి మేలని భావించే వారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
News April 4, 2026
మహిళలను వేధించే వారిని ఉపేక్షించొద్దు: CBN

AP: మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారయత్న ఘటనలో నిందితుణ్ని త్వరగా అరెస్టు చేయాలని CM CBN పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని అధికారులు CMకు తెలిపారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బాధితురాలికి గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నామన్నారు.
News April 4, 2026
BREAKING: క్యాతన్‌పల్లి BRS కైవసం

క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గుడిసల సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో, మెజారిటీ సభ్యుల మద్దతుతో వీరిద్దరూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి చంద్రయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో కొద్దిరోజులుగా మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. నూతన పాలకవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.


