News March 14, 2025
ఇండియన్ గూగుల్‌లో చిత్రాడ ట్రెండింగ్

ఇండియన్ గూగుల్‌లో చిత్రాడ గ్రామం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రాష్ట్రం యావత్తు చిత్రాడ వైపు చూస్తుంది. చిత్రాడ గ్రామం ఎక్కడా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తోంది. ఇక్కడికి సులభంగా చేరుకోవడానికి మార్గాలను నెటిజన్లు వెతుకుతున్నారు. దీనికి కారణం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం చిత్రాడలో జరగడమే. చిత్రాడ, పిఠాపురం, కాకినాడ, అన్నవరం, తుని ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు ఆన్‌లైన్‌లో బుక్ అయిపోయాయి.
Similar News
News March 22, 2026
వనపర్తి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

GPT: తాడిపర్తి లక్ష్మీసముద్రంలో ముసలి కలకలం
WNP: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే హాజరు!
PNGL: ముమ్మరంగా వాహన తనిఖీలు
WNP: జిల్లావ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
GPT: పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
PBR: కాంగ్రెస్లో చేరిన BRS నేతలు
ATKR: 81 చెక్కులు పంపిణీ చేసిన MLA
WNP: రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి నిప్పులు!
WNP: CPRతో నాగుపాముకు ఊపిరి పోశారు
WNP: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ల ప్రారంభ
News March 22, 2026
పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.
News March 22, 2026
HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యరెడ్డి అకౌంటెంట్‌కు వాట్సప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యరెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


