News March 14, 2025
కరీంనగర్: ప్రతి భవిత విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలి: కలెక్టర్

భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భవిత కేంద్రాలలో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్‌తో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు మంజూరు చేసే యుడిఐడి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News January 16, 2026
KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
News January 14, 2026
KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.
News January 14, 2026
KNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.


