News March 14, 2025
హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.
Similar News
News March 14, 2025
గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
News March 14, 2025
జీలుగుమిల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెంకు చెందిన కొర్సా సత్తిబాబు (35) మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
News March 14, 2025
తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

వెంకటపాలెంలో రేపు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.